ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2024 (10:42 IST)

ట్రైనీ డాక్టర్ అత్యాచారం.. నా కొడుకు బంగారం అంటోన్న తల్లి

Rape
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం కేసు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ నిర్దోషి అని అతడి తల్లి అంటోంది. తన కొడుకును ఎవరో ఇరికించి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. 
 
తన కుమారుడు తనను మంచిగా చూసుకున్నాడని తెలిపింది. ఇరుగుపొరుగు వారిని అడిగితే అసలు విషయం తెలుస్తుందని చెప్పుకొచ్చింది. అతడు ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించలేదని తెలిపింది.

తన భర్త మరణంతో అంతా తప్పు జరిగిందని చెప్పుకొచ్చింది. అయితే సంజయ్ సోదరి మాత్రం అతడికి కఠినశిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. 
 
మరోవైపు కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారానికి పాల్పడిన సంజయ్ రాయ్ కి దిగువ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ కేసును సీబీఐ విచారిస్తుండగా, ఇప్పటివరకు సంజయ్ రాయ్ ఒక్కడినే అరెస్ట్ చేశారు.