శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (12:34 IST)

లాక్డౌన్‌ను కూడా వదిలిపెట్టని బెట్టింగ్ రాయుళ్లు..

బెట్టింగ్ రాయుళ్లు క్రికెట్‌‌నే కాదు.. లాక్డౌన్‌ను కూడా వదిలిపెట్టలేదు. భారతదేశంలో లాక్ డౌన్ ఎప్పటి నుంచి విధిస్తున్నారు అనే అంశం మీద బెట్టింగ్ కాస్తున్నారు. మనం ఇప్పటి వరకు క్రికెట్ మ్యాచ్ లకి బెట్టింగ్ కాసిన వాళ్లను చూశాం కానీ ఇప్పుడు భారతదేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులను సైతం ఈ బెట్టింగ్ రాయుళ్లు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు.
 
కరోనా కేసులు క్యాష్ చేసుకుంటున్న బుక్కీలు దేశంలో లాక్ డౌన్ వార్తల మీద భారీగా బెట్టింగ్లు వేస్తున్నారు. మే రెండో తేదీ నుంచి లాక్ డౌన్ ఉంటుందని బెట్టింగ్లు వేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. చాలా రోజుల నుంచి ఇలా లాక్ డౌన్ ఉంటుంది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలోనే క్రికెట్ బెట్టింగ్ లాగే లాక్ డౌన్ మీద కూడా బెట్టింగ్ కడుతున్నారు యువత. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఈ లాక్ డౌన్ బెట్టింగ్ మీద కూడా కన్నేసినట్లు సమాచారం.