శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 అక్టోబరు 2021 (15:00 IST)

వెస్ట్ బెంగాల్ భవానీపూర్ బైపోల్ : మమతా బెనర్జీ ఘన విజయం

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ భ‌వానీపూర్ నియోజ‌కవ‌ర్గానికి జ‌రిగిన ఉపఎన్నిక‌లో ఘ‌న విజ‌యం సాధించారు. బీజేపీకి చెందిన ప్రియాంకా టిబ్రేవాల్‌పై ఆమె 58,832 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 
 
తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలోకి దూసుకెళ్లిన మ‌మ‌తా.. ఆ త‌ర్వాత ప్ర‌తి రౌండ్‌కూ త‌న ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లారు. మొత్తంగా మ‌మ‌త‌కు 84,709 ఓట్లు రాగా.. ప్రియాంకాకు 26,320 ఓట్లు వ‌చ్చాయి. దీంతో భారీ మెజార్టీతో విజయం సాధించారు. 
 
త‌న ఓట‌మిని ప్రియాంకా అంగీక‌రించారు. అయితే వాళ్లు ల‌క్ష‌కుపైగా మెజార్టీ గెలుస్తామ‌ని చెప్పార‌ని, ఇప్పుడు అది 50 వేల‌కే ప‌రిమిత‌మైంద‌ని ఆమె అన్నారు. 
 
త‌న‌ను గెలిపించిన భ‌వానీపూర్ ప్ర‌జ‌ల‌కు మ‌మ‌త కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇక్క‌డ 46 శాతం మంది బెంగాలీ కాని ఓట‌ర్లు ఉన్నారు. వాళ్లంతా నాకే ఓటేశారు. నాపై న‌మ్మ‌కం ఉంచినందుకు సంతోషం. భ‌వానీపూర్ ప్ర‌జ‌ల‌కు నేనెప్పుడూ రుణ‌ప‌డి ఉంటాను అని మ‌మ‌తా అన్నారు.