శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2017 (12:02 IST)

భార్య రెండో పెళ్లి చేసుకుంది.. బిడ్డను చూడనివ్వట్లేదని..?

భార్య నుంచి ఓ భోజ్ పురి నటుడు విడిపోయాడు. ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అయితే భార్యకు గుణపాఠం చెప్పాలనుకుని.. ప్రియురాలితో కలిసి తన బిడ్డనే కిడ్నాప్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల

భార్య నుంచి ఓ భోజ్ పురి నటుడు విడిపోయాడు. ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అయితే భార్యకు గుణపాఠం చెప్పాలనుకుని.. ప్రియురాలితో కలిసి తన బిడ్డనే కిడ్నాప్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లో భోజ్ పురి చిత్రాల్లో నటించే ముహమ్మద్ షాహిద్ (23)కు ముస్కాన్ అనే భార్య వుంది.

వీరికి షహనాజ్ అనే రెండేళ్ల కుమారుడు వున్నాడు. అయితే షాహిద్, ముస్కాన్‌తో ఏర్పడిన వివాదాలు విడాకులకు దారితీసింది. ముస్కార్ రెండో వివాహం చేసుకుంది. షాహిద్ కూడా సునయన శర్మ అలియాస్ అలీషా అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు.
 
కోర్టు ఆదేశాల మేరకు షెహనాజ్ తల్లి సంరక్షణలో ఉన్నాడు. అతనిని చూసేందుకు షాహిద్‌కు అనుమతి కూడా వుంది. కానీ కుమారుడిని చూసేందుకు షాహిద్‌ను ముస్కాన్ అనుమతించడం లేదు. దీంతో కోపంతో రగిలిపోయిన షాహిద్ తన మాజీ భార్యకు బాగా బుద్ధి చెప్పాలనుకున్నాడు. అంతే తన ప్రియురాలితో కలిసి ఓ ప్లాన్ వేశాడు.

తన కుమారుడిని కిడ్నాప్ చేశాడు. ఆపై తన మాజీ భార్య నిర్లక్ష్యం వల్లే కొడుకు కిడ్నాప్‌కు గురయ్యాడని కేసు పెట్టాడు. పోలీసులు విచారణ చేపట్టారు. కానీ అప్పుడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాపైన బాలుడు షాహిద్ ఇంట్లోనే ఉన్నాడని తేలింది. దీంతో షాహిద్‌తో పాటు అతని ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.