మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2017 (11:28 IST)

ట్రాక్టర్‌పై రంగు చెడిపేశాడనీ...

పంజాబ్ రాష్ట్రం అమృతసర్‌ సమీపంలో ఓ దారుణం జరిగింది. ట్రాక్టర్‌పై ఉన్న రంగును చెడిపేశాడని 18 ఏళ్ల యువకుడు ఆరేళ్ల బాలుడిని పాశవికంగా హత్య చేశాడు. ఈ దారుణం మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో జరిగింది.

పంజాబ్ రాష్ట్రం అమృతసర్‌ సమీపంలో ఓ దారుణం జరిగింది. ట్రాక్టర్‌పై ఉన్న రంగును చెడిపేశాడని 18 ఏళ్ల యువకుడు ఆరేళ్ల బాలుడిని పాశవికంగా హత్య చేశాడు. ఈ దారుణం మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... మాలిక్‌పూర్ అనే గ్రామంలో గుర్‌ప్రీత్ సింగ్(18) అనే యువకుడి కుటుంబానికి సొంత ట్రాక్టర్ ఉంది. అయితే ఈ ట్రాక్టర్‌పై ఉన్న కలర్‌ను పొరుగున ఉన్న పిల్లలు చెడిపేస్తూ వస్తున్నారు. 
 
ట్రాక్టర్ రంగు చెడొపొద్దని పలుమార్లు పిల్లలను గుర్‌ప్రీత్ హెచ్చరించాడు. అయినప్పటికీ పిల్లలు ఏమాత్రం పట్టించుకోక పోవడంతో కోపం పెంచుకున్న గుర్‌ప్రీత్.. సుభ్‌ప్రీత్(6) అనే బాలుడిని గ్రామం బయటకు తీసుకెళ్లి హత్య చేశాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గుర్‌ప్రీత్‌ను అరెస్టు చేశారు.