ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2017 (12:46 IST)

ఏడుస్తూ నిద్రకు భంగం కలిగిస్తున్నాడనీ... కన్నకొడుకును దారుణంగా చంపేసిన కసాయి తండ్రి...

రాత్రిపూట ఏడుస్తూ నిద్రకు భంగం కలిగిస్తున్నాడన్న కోపంతో కన్న కుమారుడినే ఓ కసాయి తండ్రి చంపేశాడు. పిల్లల ఆలనాపాలన చూడాల్సిన తండ్రే ఉన్మాదిగా మారాడు. చిన్న పిల్లాడు ఏడుస్తూ నిద్రకు భంగం కలిగించాడనే కోపం

రాత్రిపూట ఏడుస్తూ నిద్రకు భంగం కలిగిస్తున్నాడన్న కోపంతో కన్న కుమారుడినే ఓ కసాయి తండ్రి చంపేశాడు. పిల్లల ఆలనాపాలన చూడాల్సిన తండ్రే ఉన్మాదిగా మారాడు. చిన్న పిల్లాడు ఏడుస్తూ నిద్రకు భంగం కలిగించాడనే కోపంతో గొంతు పిసికి చంపేసి ఇంటిదగ్గర ఉన్న మురికి కాలువలోకి విసిరేశాడు. 
 
ఈ దారుణం బీహార్‌ రాష్ట్రంలోని పూర్ణియా జిల్లా బెలవాడన్‌ గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే మంగళ్‌ శర్మ (35) అనే వ్యక్తి దినకూలిగా పనిచేస్తున్నాడు. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి అతను నిద్రపోతున్నప్పుడు చిన్న కొడుకు ఆదర్శ్‌ కుమార్‌ (2) ఏడ్చాడు. 
 
కాసేపటి తర్వాత మంగళ్ శర్మ భార్య సులేఖ దేవి లేచి చూడగా చిన్న కొడుకు కనిపించలేదు. భర్తను ఈ విషయం అడగ్గా, సరైన సమాధానం చెప్పలేదు. అమెకు అనుమానం వచ్చి ఇంటి బయట చూడటంతో కాలువలో కొడుకు మృతదేహం కనిపించింది. భార్య ఫిర్యాదుతో భర్తను పోలీసులు అరెస్టు చేశారు.