మంగళవారం, 15 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (15:44 IST)

అక్కా చెలెళ్ల గ్యాంగ్ రేప్.. బిర్యానీలో బీప్ అన్నీ చిన్న విషయాలే: ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు

రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న జంట హత్యలు, అక్కా చెల్లెళ్ల గ్యాంగ్ రేప్, మేవాత్‌లో బిర్యానీలో బీఫ్ తదితర సంచలనం కలిగించిన నే

రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న జంట హత్యలు, అక్కా చెల్లెళ్ల గ్యాంగ్ రేప్, మేవాత్‌లో బిర్యానీలో బీఫ్ తదితర సంచలనం కలిగించిన నేరాలన్నీ చిన్న విషయాలని ఖట్టర్ పేర్కొన్నారు.

బిర్యానీలో బీప్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం చేస్తున్న విజిలెన్స్ దాడులను కూడా సమర్థించుకున్నారు. నవంబర్ 1న హర్యానా రాష్ట్రం ఏర్పడి 50వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం గోల్డెన్ జూబ్లీ సంబరాలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కట్టర్ అధికారిక లోగో విడుదల చేశారు. 
 
ఆగస్టులో మెవాత్‌తో 20ఏళ్ల మహిళతో పాటు ఆమెతో ఉన్న 14ఏళ్ల బాలికపై కొందరు దుండగలు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. నిందితులపై తీసుకుంటున్న చర్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు కట్టర్ అసహనానికి గురయ్యారు. రాష్ట్రం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతుంటే గ్యాంగ్ రేప్ ఘటన, బీప్ బిర్యానీ విజిలెన్స్ సంగతులు పక్కనబెట్టాలని, శుభసందర్భంలో అవన్నీ చాలా చిన్నవని ఆయన వ్యాఖ్యానించారు.