ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

కర్నాటకలో పార్టీ నేతలకు షాకిస్తున్న బీజేపీ హైకమాండ్

bjp flag
కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమైవున్నాయి. అయితే, కేంద్రంతో పాటు కర్నాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతలకు తేరుకోలేని షాకిస్తుంది. ఇది కర్నాటక నేతల్లో చిచ్చు రేపుతున్నాయి. 70 యేళ్లు దాటితే, గెలిచే అవకాశాలు అంతంత మాత్రంగా ఉండే వారికి టిక్కెట్లు ఇవ్వబోమని తేల్చి చెబుతున్నాయి. ఈ విషయాన్ని కొందరు పార్టీ సీనియర్ నేతలకు చేరవేశారు కూడా. ఇపుడు ఇది సీనియర్ నేతల్లో చర్చనీయాంశంగా మారింది.
 
పార్టీ తీసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ఈశ్వరప్ప (74) రాజకీయాల గురించి తప్పుకుంటున్నట్టు ప్రటించారు. అంతేకాకుండా, ఈ దఫా తనకు టిక్కెట్ ఇవ్వొద్దని ఆయన బీజేపీ అధిష్టానానికి లేఖ రాశారు. మరో మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ (67) కూడా ఈ విషయమై తనకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చినట్టు తెలిపారు. పోటీ నుంచి తప్పుకోవాలని కోరారని, అందుకు తాను నిరాకరించానని తెలిపారు. 
 
తానికంగా పదేళ్లపాటు రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. పైగా, పోటీ చేసిన ప్రతిసారీ కనీసం 25 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందుతున్నట్టు ఈయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. పైగా, సీఎంగా పనిచేసిన తనలాంటి సీనియర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.