సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (15:25 IST)

బీజేపీ పురోగతిలో ఎందరివో త్యాగాలు ఉన్నాయి.. ప్రధాని మోడీ

pmmodi
భారతీయ జనతా పార్టీ పురోగతిలో ఎందరివో, ఎన్నో త్యాగాలు దాగివున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ పురోగతిలో ఎందరివో త్యాగాలు ఉన్నాయి. హనుమాన్ మాదిరిగా కార్యకర్తలు పని చేయాలి. ప్రజాస్వామ్యానికి ఓ మాతృక అని చెప్పారు. 
 
కాగా, లోక్‌సభలో రెండు సీట్లతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన బీజేపీ నేడు 303 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆర్ఆర్ఎస్ హిందూ జాతీయ వాదం ఎజెండాతో తొలుత జన్‌సంఘ్‌గా ప్రస్థానం ప్రారంభించింది. దేశంలో ఎమర్జెన్సీ అనంతరం 1980, ఏప్రిల్ 6వ తేదీన బీజేపీగా అవతరించింది. అప్పటి నుంచి అంచలంచెలుగు ఎదుగుతూ ఇపుడు దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది.