సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 28 జనవరి 2017 (23:00 IST)

వహ్వా బీజేపీ మేనిఫెస్టో... యూపీ యువత గాల్లో తేలినట్టుందే... ఏపీ హోదా గాలికి...

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తన్నుకొస్తున్నాయి. భాజపా తాయిలాలు మొదలుపెట్టింది. అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయడానికి శతివిధాలా ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడులో ఆల్ ఫ్రీ అన్న చందంగా ఓ మ్యానిఫెస్టోను విడుదల చేసిం

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తన్నుకొస్తున్నాయి. భాజపా తాయిలాలు మొదలుపెట్టింది. అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయడానికి శతివిధాలా ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడులో ఆల్ ఫ్రీ అన్న చందంగా ఓ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. దానికి ‘లోక్‌ కల్యాణ్‌ సంకల్ప పత్ర్‌’ అని పేరు పెట్టేసి హామీలను గుప్పించింది. మన ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ గాలికి అటూఇటూ ఆడుతోంది కానీ యూపీకి ఇచ్చిన చిట్టా చూస్తే యూపీ యువత గాల్లో తేలినట్లుందే అని పాట పాడుకుంటారు మరి. ఆ వివరాలను చూడండి...
 
1. రైతు రుణ మా'ఫీ'
2. యువతకు యూనివర్శిటీల్లో వైఫై 'ఫ్రీ'
3. యువతకు ఇంటర్నెట్టుతో కూడిన ల్యాప్‌టాప్‌లు 'ఫ్రీ'
4. ఇంటికి గ్యాస్ కనెక్షన్ 'ఫ్రీ'.
5. +2 వరకూ చదువు 'ఫ్రీ'
ఇంకా వీటితోపాటు ఎన్నో హామీలు వరదలా గుప్పించింది బీజేపి. మరి ఇవన్నీ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తారో లేదంటే అవి అడ్డంగా వున్నాయి ఇవి అడ్డంగా వున్నాయి... ఆ రాష్ట్రం ఊరుకోవడం లేదు... ఈ రాష్ట్రం వూరుకోవడంలేదు అంటూ మళ్లీ డ్రామాలు ఆడుతారో నాయకులకే తెలియాలి.