బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 21 సెప్టెంబరు 2017 (17:20 IST)

నేను హనీ, హృతిక్ డేరా అయితే బావుంటుంది... రాఖీ సావంత్

డేరా బాబా దారుణాలు ఒకటొకటిగా వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. హత్యలు, అత్యాచారాల నిలయంగా డేరా బాబా ఆశ్రమం లోగిలి దారుణాల గనిగా కనబడుతోంది. తవ్వేకొద్దీ దారుణాలు వెలుగుచూస్తున్నాయి. మరోవైపు డేరా బాబా దత్తపుత్రికగా చెప్పబడుతున్న హనీ తప్పించుకుని తిరుగు

డేరా బాబా దారుణాలు ఒకటొకటిగా వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. హత్యలు, అత్యాచారాల నిలయంగా డేరా బాబా ఆశ్రమం లోగిలి దారుణాల గనిగా కనబడుతోంది. తవ్వేకొద్దీ దారుణాలు వెలుగుచూస్తున్నాయి. మరోవైపు డేరా బాబా దత్తపుత్రికగా చెప్పబడుతున్న హనీ తప్పించుకుని తిరుగుతోంది. ఈ నేపధ్యంలో బాలీవుడ్ సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్‌ను దీనిపై స్పందించమని కోరితే ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.
 
డేరా బాబా-బయోపిక్ తీసేందుకు ఎవరైనా ఆసక్తి చూపిస్తే తను హనీ పాత్రలో నటిస్తానని చెప్పుకొచ్చింది. ఇంకా డేరా పాత్రలో హృతిక్ రోషన్ లేదా అక్షయ్ కుమార్ అయితే సూటవుతారనీ, వారిలో ఎవరో ఒకరిని డేరా పాత్రలో బుక్ చేస్తే తను నటించేందుకు సిద్ధంగా వున్నట్లు చెప్పుకొచ్చింది. మరి రాఖీ సావంత్ మాటలు విన్నవారు ఎవరైనా డేరా బాబా బయోపిక్ తీసేందుకు ఉత్సాహం చూపిస్తారేమో చూడాలి.