బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (08:52 IST)

ఎస్‌బీఐ యోనో సేవలకు బ్రేక్!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో యాప్ సేవలు నేడు అందుబాటులో ఉండవు. అయితే ఇది కేవలం కొంతసేపు మాత్రమే. ఎస్‌బీఐ యోనో యాప్ నిర్వహణలో భాగంగా ఈ అసౌకర్యం కలుగుతుందని బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 13 వ తేదీన బ్యాంక్ యోనో యాప్ పని చేయదు.
 
ఇప్పటికే అక్టోబర్ 11 వ తేదీన కూడా ఈ సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇక అక్టోబర్ 13 అంటే నేడు యోనో యాప్ సర్వీసులు అందుబాటులో ఉండవు. అయితే కేవలం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో యోనో యాప్ పని చేయదు.
 
యోనో యాప్ సర్వీసులు అందుబాటులో ఉండవని, అందువల్ల బ్యాంక్ కస్టమర్లు దీనికి అనుగుణంగా వారి బ్యాంకింగ్ కార్యకలాపాలను సెట్ చేసుకోవాలని ఎస్‌బీఐ కోరింది. ఎస్‌బీఐ యోనో వాడే వారు ప్రత్యామ్నాయంగా ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా సేవలు పొందొచ్చని తెలిపింది.