శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: సోమవారం, 12 అక్టోబరు 2020 (18:55 IST)

నీట్ రాయలేకపోయిన విద్యార్థులకు తీపి కబురు: సుప్రీం కోర్టు

ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్షను ఎంతోమంది విద్యార్థులు రాయలేకపోయారు. కరోనా కారణంగా వీరు పరీక్షకు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులకు సుప్రీంకోర్టు తీపి కబురు అందించింది. 
 
అక్టోబరు 14న నీట్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. కరోనాను దృష్టిలో ఉంచుకొని పరీక్షకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సుప్రీంకోర్టు ఆదేశిం చింది. నీట్ ఫలితాలు అక్టోబరు 16 వెల్లడి కానున్నాయి.
 
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ విధిగా ధరించాలని సూచించారు. విద్యార్థుల చేతులను కూడా శానిటైజేషన్ చేస్తారు. మరోవైపు సుప్రీం నిర్ణయం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.