ఫీజుల కోసం విద్యార్థులను బలవంతం చెయ్యొద్దు: పేదల పెన్నిధి సోనూ సూద్

Sonu sood
వి| Last Modified సోమవారం, 28 సెప్టెంబరు 2020 (19:52 IST)
పేదలపాలిట పెన్నిధిగా మారిన సోనూ సూద్, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలకు ఓ విజ్ఞప్తి చేసారు. ఫీజులు కట్టాలని విద్యార్థులను బలవంతం చేయవద్దని కోరారు. పేద విద్యార్థులు ఫీజులు డిపాజిట్ చేయనందుకు ఆన్‌లైన్ క్లాసులను నిలిపివేయవద్దని విన్నవించారు.

ఫీజులు చెల్లించేందుకు కాస్త సమయం ఇవ్వండి. మీరు చేసే
చిన్న సాయం ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతుంది. వాళ్లను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుందని సోనుసూద్ ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్లో విద్య కంటే గొప్ప విరాళం మరొకటి లేదని కొనియాడారు. ఫీజుల కోసం చదువుకునే విద్యార్థులు హక్కును హరించవద్దన్నారు. సోనుసూద్ ట్వీట్ చేసిన 30 నిమిషాల్లో ఈ పోస్టును 10,000 మందికి పైగా ఇష్టపడగా, 2000 మందికి పైగా రీ-ట్వీట్ చేశారు.

దీనికి ముందు సోనుసూద్‌కి
ఓ అమ్మాయి సహాయం కోరింది. తను చాలా పేదరాలని తనది స్కూలు ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితి అని తెలిపింది. అయితే చదువుకోవాలనే కోరిక తనలో మెండుగా ఉన్నదని తెలిపింది. తన చదువులకోసం సహాయం అందించాలని సోనుసూద్‌కి పోస్ట్ చేసింది. సినిమాల్లో ఎక్కువగా విలన్‌గా కనిపించే సోనుసూద్ నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా నిలుస్తున్నారు.

లాక్‌డౌన్ సమయంలో ఎందరో వలస కూలీలను ఆదుకొని వారిని వారి యొక్క స్వగ్రామాలకు తరలించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో పేదలకు నిజ దేవుడిగా సోనుసూద్ నిలిచారు. అంతటితో తన సేవలను ఆపలేదు. కష్టం అనే మాటలు తన చెవికి అందితే చాలు అక్కడ వాలిపోతారు. సమస్య కనిపిస్తే చాలు సొల్యూషన్‌లా కనిపిస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా సోనుసూద్ పేరే వినబడుతోంది.దీనిపై మరింత చదవండి :