గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2020 (11:51 IST)

1800 విద్యార్థులు, సిబ్బందికి కరోనా.. ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం.. ఎక్కడ?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 3.68 కోట్లను దాటింది. కరోనా మృతుల సంఖ్య 10.67 లక్షలను దాటింది. ఈ మహమ్మారి బారినపడిన 2.76 కోట్లమంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 80.39 లక్షల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 68 వేలకు మించిన బాధితుల పరిస్థితి విషమంగా ఉంది.
 
మరోవైపు ఇంగ్లాండ్‌లో 1800కు మించిన యూనివర్శిటీ విద్యార్థులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం వెయ్యికిపైగా విద్యార్థులు, 12 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీనికి ముందు 94 మంది విద్యార్థులు కరోనా బారిన పడినట్లు గుర్తించారు. 
 
ఇదేవిధంగా నార్త్ఊంబరియా యూనివర్శిటీకి చెందిన 619 మంది, డర్హమ్ యూనివర్శిటీకి చెందిన 219 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీలను మూసివేసి తిరిగి ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించారు.