55 గంటల సీఎం యడ్యూరప్ప రాజీనామా... భాజపా పరువు పోయిందా...
కర్నాటకలో భాజపా కల చెదిరింది. దీనితో కేవలం 55 గంటలపాటు ముఖ్యమంత్రిగా వున్న బీఎస్ యడ్యూరప్ప రాజీనామా చేయక తప్పలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో భాజపా కుదేలైందనే అనుకోవాలి. మ్యాజిక్ ఫిగర్ 112 రాదని స్పష్టంగా తేలడంతో యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు
కర్నాటకలో భాజపా కల చెదిరింది. దీనితో కేవలం 55 గంటలపాటు ముఖ్యమంత్రిగా వున్న బీఎస్ యడ్యూరప్ప రాజీనామా చేయక తప్పలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో భాజపా కుదేలైందనే అనుకోవాలి. మ్యాజిక్ ఫిగర్ 112 రాదని స్పష్టంగా తేలడంతో యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప తన పదవిని కాపాడుకునేందుకు సర్వవిధాలా ప్రయత్నించారు. అయతే, ఆ ప్రయత్నాలేవీ ఫలించక పోవడంతో మరో మార్గం లేక ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
ఇక యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి ఊరిస్తూనే వుంది. 2007 సంవత్సరంలో ఆయన కేవలం 8 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా రాజీనామా చేశారు. ఆ తర్వాత 2008లో 3 ఏళ్ల 2 నెలలు పాటు సీఎం పదవిలో కొనసాగారు. ఇక 2018లో 104 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కాంగ్రెస్-జేడీఎస్ కలవడంతో దెబ్బైపోయింది. దీనితో ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన యడ్యూరప్ప ఈ రోజు రాజీనామా చేశారు. దీనితో ఆయన కేవలం 55 గంటల పాటు మాత్రమే ముఖ్యమంత్రిగా వున్నట్లయింది.