ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 మే 2024 (16:36 IST)

సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల ఘటన.. నిందితుడు ఆత్మహత్య

suicide
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడుగా ఉన్న ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెలలో ఈ కాల్పులు జరిగ్గా, ఇవి స్థానికంగా కలకలం రేపాయి. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో అనూజ్ తపన్ అనే నిందితుడు జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం తన బారక్‌లో ఉరేసుకున్నాడు. రాత్రి నిద్రించేందుకు కేటాయించిన దుప్పటితోనే అతడు ఉరేసుకోవడం గమనార్హం. బుధవారం ఉదయం పోలీసులు సాధారణ తనిఖీల కోసం వెళ్లగా అపస్మారక స్థితిలో పడివుండటాన్ని గమనించి హుటాహుటిన జైలు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
అయితే, అనూజ్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై విచారణ జరుపుతుందని ముంబై పోలీస్ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఇది ముమ్మాటికీ హత్యేనని మహారాష్ట్ర మాజీ సీనియర్ మాజీ పోలీస్ అధికారి పీకే జైన్ అనుమానం వ్యక్తం చేశారు. సాధారణంగా లాకప్‌లో ఎవరు మరణించినా అది హత్యగానే పరిగణిస్తారని తెలిపారు. పోలీసులు లాకప్‌లను తనిఖీ చేస్తుంటారని అన్నారు. ఖైదీలు తప్పించుకోకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా పోలీసుల నిఘా ఉంటుందని ఆయన తెలిపారు.