శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జులై 2023 (15:05 IST)

నదిలో చిక్కుకున్న బస్సు- 36మంది ప్రయాణీకులు ఏమయ్యారు?

Bus
Bus
దేశంలో రుతుపవనాలు పూర్తి స్వింగ్‌లో వున్నాయి. దీంతో అనేక ప్రాంతాలలో వర్షాలు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా యూపీ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో నీటి ఎద్దడి లాంటి పరిస్థితి నెలకొంది. అలాంటి ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా బస్సు నదిలో చిక్కుకుపోయింది. 
 
36 మంది ప్రయాణికులతో వెళ్తున్న రోడ్డు మార్గం బస్సు మండవాలి జిల్లా పరిధిలోకి వచ్చే బిజ్నోర్‌లోని కోట వాలి నదిలో చిక్కుకుంది. బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులు దాదాపు మూడు గంటల పాటు నరకం అనుభవించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
 
అక్కడ బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల అరుపులు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. నది ప్రవాహానికి బస్సు కొట్టుకుపోకుండా జేసీబీతో బస్సును స్థిరంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. 
 
అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం బస్సులో మూడు డజన్ల మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బోల్తా పడకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. 
 
బస్సు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులను బయటకు తీసే పని ప్రారంభించారు. చివరికి బిజ్నోర్‌లోని కొత్వాలి నదిలో ఇరుక్కున్న ఈ బస్సు నుండి ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించినట్లు అధికారులు తెలిపారు.