శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 17 జులై 2023 (23:18 IST)

టీఎస్ ఆర్టీసీలో కొత్త రకం బస్ పాస్‌లు.. 18 నుంచి రోడ్లపైకి...

tsrtc
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో కొత్తరకం బస్ పాస్‌లను ప్రవేశపెట్టింది. వీటిని మంగళవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకునిరానుంది. పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్ పేరుతో ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన ఈ పాస్‌లను తొలుత నాలుగు జిల్లాల్లో తిరిగే బస్సుల్లో అందుబాటులోకి తీసుకునిరానున్నారు. 
 
మంగళవారం నుంచి కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. 10 కిలోమీటర్ల పరిధిలో నెలకు రూ.800, ఐదు కిలోమీటర్ల పరిధిలో నెలకు రూ.500తో ఈ పాస్‌ను తీసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు టౌన్‌ బాస్‌పాస్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. 
 
ఏపీ ఉద్యోగుల సంఘం నేతకు చుక్కెదురు 
 
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపిస్తూ పటమట పోలీసులు సూర్యనారాయణపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో విజయవాడ ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు అనుమతిచ్చింది. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపి నిర్ణయం చెప్పాలని ఏసీబీ కోర్టును ఆదేశించింది. ఏసీబీ కోర్టు తీర్పు వెలువడే వరకు సూర్యనారాయణపై చర్యలు తీసుకోవద్దని గతంలో పోలీసులను ఆదేశించింది. తాజాగా ఏసీబీ కోర్టు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసే అవకాశముంది.