మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 జులై 2017 (11:29 IST)

విమానంలో నిద్రిస్తున్న మహిళపై లైంగిక వేధింపులు.. తాకరాని చోట తాకాడు..

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కదిలే బస్సుల్లో, రైళ్లల్లో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు సాధారణమైపోయాయి. అయితే ప్రస్తుతం ఎగరే విమానంలోనూ మహిళలపై లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నా

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కదిలే బస్సుల్లో, రైళ్లల్లో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు సాధారణమైపోయాయి. అయితే ప్రస్తుతం ఎగరే విమానంలోనూ మహిళలపై లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే ఓ వ్యక్తి తన పక్క సీటు మహిళ పట్ల విమానంలో అభ్యంతరకర రీతిలో ప్రవర్తించాడని.. అరెస్టయిన ఘటన మరవక ముందే.. విమానంలో నిద్రిస్తున్న మహిళపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. విమానంలో ఓ మహిళ నిద్రిస్తుండగా... పక్కనే ఉన్న ప్రయాణికుడు ఆమెను లైంగికంగా వేధించిన దారుణ ఘటన బెంగళూరు-ముంబై విమానంలో వెలుగుచూసింది. ఓ మహిళ జూన్ 27న బెంగళూరు నుంచి ముంబైకు విమానంలో ప్రయాణిస్తూ సీట్లో నిద్రకు ఉపక్రమించింది. 
 
అంతే పక్కనే ఉన్న సబీన్ హంజా అనే వ్యక్తి మహిళ శరీరాన్ని తాకరాని చోట తాకాడు. అభ్యంతరకర రీతిలో ప్రవర్తించాడు. దీంతో బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో.. విమానం ముంబైలో దిగగానే ఎయిర్ లైన్స్ సిబ్బంది నిందితుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. ఈ విచారణలో అతడు నావి ముంబైకి చెందిన వ్యక్తి అని.. బిజినెస్‌మేన్ అని తేలింది.