1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 20 అక్టోబరు 2016 (18:56 IST)

అందుకే జయలలిత ఫోటో పెట్టుకున్నారట... అన్నాడీఎంకె అదే చెప్తోంది...

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకున్నారనీ, మరికొద్ది రోజుల్లో ఆమె తన స్వగృహానికి తిరిగి వస్తారని అన్నాడీఎంకె పార్టీ వర్గాలు గురువారం నాడు వెల్లడించాయి. అమ్మ జయలలిత ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేశారనీ, తన ఆరోగ్యరీత్యా వైద్యుల సలహా మేరకే ఆమె ఆసుపత

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకున్నారనీ, మరికొద్ది రోజుల్లో ఆమె తన స్వగృహానికి తిరిగి వస్తారని అన్నాడీఎంకె పార్టీ వర్గాలు గురువారం నాడు వెల్లడించాయి. అమ్మ జయలలిత ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేశారనీ, తన ఆరోగ్యరీత్యా వైద్యుల సలహా మేరకే ఆమె ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చిందని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సరస్వతి వెల్లడించారు. కాగా జయలలిత అనారోగ్యంతో గత సెప్టెంబరు నెల 22న అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
 
కాగా తమిళనాడు సీఎం జయలలితకు నమ్మినబంటు ఆర్థిక మంత్రి ఓ పన్నీర్ సెల్వం నేతృత్వంలో బుధవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమ్మ లేకపోయినా తాను కూర్చున్న చైర్‌కు ముందు జయమ్మ పెద్ద ఫోటోను ఉంచి మంత్రివర్గ సమావేశాన్ని కొనసాగించారు. ఆ విధంగా జయలలిత పట్ల తనకున్న ఆరాధనను చాటుకున్నారు. 32 మంది మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
 
గత నెల 22 నుంచి అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆమెకున్న పోర్ట్‌ఫోలియోలన్నీ పన్నీర్‌సెల్వంకు కేటాయించడం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్మ లేకుండా పన్నీర్ సెల్వం నేతృత్వంలో జరిగిన ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా కావేరీ సమస్యను ప్రస్తావనకు తెచ్చినట్లు తెలుస్తోంది. 
 
ఈనెల 24తో కౌన్సిలర్లు, మేయర్ల పదవీ కాలం ముగుస్తున్నందున స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారుల నియామకానికి సంబంధించిన అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం. కాగా జయలలిత క్రమంగా కోలుకుంటున్నారన.. ఆమె మంచినీరు, ఉడకబెట్టిన యాపిల్‌ పండ్లను తీసుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆమెకు అపోలో వైద్యులతో పాటు లండన్‌కు చెందిన వైద్యులు రిచర్డ్‌ బీలే, ఎయిమ్స్‌ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తాజాగా సింగపూర్‌కు చెందిన మరో ఇద్దరు వైద్యనిపుణులు కూడా ఫిజియోథెరపీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.