1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 మే 2024 (16:38 IST)

చెన్నై లోకల్ రైలులో చైన్ స్నాచర్లు.. నిద్రిస్తున్న మహిళ మెడలోని?

Chain snatchers
Chain snatchers
చెన్నై లోకల్ రైలులో చైన్ స్నాచర్లు ప్రయాణీకులను ఆందోళనకు గురి చేస్తోంది. చెన్నై అరక్కోణం లోకల్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో సీటుపై నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలి మెడలోని మంగళసూత్రాన్ని లాక్కుని కదులుతున్న రైలు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన దుండగుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దొంగను పట్టుకునేందుకు తోటి ప్రయాణీకులు సైతం వెంటనే స్పందించారు. ఆపై పోలీసులకు సమాచారం అందించడంతో రైల్వే పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.