శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఆగస్టు 2022 (11:09 IST)

చెన్నైలో మరో భారీ విమానాశ్రయం.. ఎందుకో తెలుసా?

flight
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఇప్పటికే ఓ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. కానీ నానాటికీ పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య.. కార్గో సేవలకు కూడా డిమాండ్ పెరుగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం చెన్నై నగరంలో మరో భారీ విమానాశ్రయం నిర్మాణం చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ ప్రకటించారు.
 
డీఎంకే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుందని.. ప్రస్తుతం డీపీఆర్ రూపొందించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీఎం స్టాలిన్ వెల్లడించారు. ప్రభుత్వ సంస్థ టిడ్కో చెన్నై సమీపంలోని పరందూర్‌లో నూతన విమానాశ్రయం కోసం స్థలాన్ని అన్వేషిస్తోందని తెలిపారు. 
 
రూ.20,000 కోట్ల ఖర్చు అంచనాతో ఈ ఎయిర్ పోర్టును నిర్మించనున్నామని..దీంతో 10 కోట్ల మంది ప్రయాణించేందుకు వీలుగా ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతామని సీఎం స్టాలిన్ వివరించారు.
 
ఈ విమానాశ్రయంలో 2 రన్ వేలు, ప్రయాణికుల టెర్మినల్ భవనాలు, కార్గో టెర్మినల్, ట్యాక్సీ వేలు, యాప్రాన్ ఉంటాయని వివరించారు. విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుండడం, సరకు రవాణా రంగంలో ఏర్పడిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు.