సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 ఆగస్టు 2018 (09:02 IST)

మహిళా ఎస్పీని వాటేసుకుని.. ముద్దుపెట్టి... పిరుదులు నొక్కిన ఐజీపీ... ఎక్కడ?

లైంగిక వేధింపులు కేవలం సాధారణం మహిళలకే కాదు.. మహిళా పోలీసు ఉన్నతాధికారిణిలకు కూడా తప్పడం లేదు. తన కింద పని చేసే ఓ మహిళా ఎస్పీ పట్ల ఐజీ ర్యాంకు అధికారి రాయలేని రీతిలో అసభ్యంగా ప్రవర్తించాడు.

లైంగిక వేధింపులు కేవలం సాధారణం మహిళలకే కాదు.. మహిళా పోలీసు ఉన్నతాధికారిణిలకు కూడా తప్పడం లేదు. తన కింద పని చేసే ఓ మహిళా ఎస్పీ పట్ల ఐజీ ర్యాంకు అధికారి రాయలేని రీతిలో అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళా ఎస్పీని తన గదికి పిలిపించుకుని చేయిపట్టుకుని లాగి.. పిరుదులను బలంగా నొక్కాడు. ఆ తర్వాత అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో ఉన్న అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో జరిగింది.
 
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... చెన్నైలోని ఏసీబీ ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న ఓ ఐజీపీ తన కింద పనిచేస్తున్న మహిళా ఎస్పీపై కొద్ది నెలలుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమెతో గంటల తరబడి అశ్లీలంగా మాట్లాడేవారని సమాచారం. ఈ విషయంపై ఆమె తన ఉన్నతాధికారి (ఏసీబీ కమిషనర్‌) జయంత్‌ మురళికి లిఖిత పూర్వకంగా కూడా ఫిర్యాదు చేసింది. 
 
అయితే, ఆయన పెద్దగా పట్టించుకోక పోవడంతో ఐజీ మరింతగా రెచ్చిపోయాడు. ఈ క్రమంలో తాజాగా మహిళా ఎస్పీని తన గదికి పిలిచి.. చేయిపట్టుకుని లాగి.. హత్తుకుని ముద్దులు పెట్టడమే కాకుండా, పిరుదులను గట్టిగా నొక్కినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఆ కామాంధుడి బారి నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన మహిళా ఎస్పీ.. డీజీపీతోపాటు, హోంశాఖ కార్యదర్శికి 10 రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. 
 
ఈ విషయం సీఎం కార్యాలయం దృష్టికి వెళ్లింది. దీంతో ఆ మహిళా ఎస్పీ ఫిర్యాదుపై తీసుకున్న చర్యలు ఏమిటో తెలియజేయాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సంజాయిషీ నోటీసులు వచ్చాయి. ఫలితంగా పోలీసు యంత్రాంగంలో కదలిక వచ్చింది. వెంటనే ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు ఏడీజీపీ సీమా అగర్వాల్‌ నేతృత్వంలో ఓ కమిటీని డీజీపీ ఏర్పాటు చేశారు.