తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్?
ఉదయనిధి స్టాలిన్‌ను ఉప ముఖ్యమంత్రిగా చేస్తారనే ప్రచారం తమిళనాడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఉదయనిధికి ఇన్‌ఛార్జి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. డీఎంకే నుంచి దీనిపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, అది వాస్తవరూపం దాల్చేందుకు ఎప్పుడు చర్యలు తీసుకుంటారనే దానిపై చాలా ఊహాగానాలు ఉన్నాయి.
ఉదయనిధిని డిఎంకె యువజన విభాగం అధిపతిగా చేస్తారని, పార్టీ టిక్కెట్‌తో పాటు మంత్రి పదవి కూడా ఇస్తారని గతంలో ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టుగానే ఉదయనిధి ఇప్పుడు అన్ని పదవులు అనుభవిస్తున్నారు. తమిళనాడుకు ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. అయితే ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్,ఉదయనిధి పుకార్లను ఖండిస్తున్నారు.