గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జులై 2024 (12:01 IST)

పాము గొంతులో దగ్గు సిరప్ బాటిల్.. కాపాడిన టీమ్‌కు ప్రశంసలు

snake
snake
ఒడిశాలోని భువనేశ్వర్‌లోని స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యులు నిస్సహాయ నాగుపామును రక్షించినందుకు ప్రశంసలు అందుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్న వీడియో ప్రకారం, పాము పొరపాటున దగ్గు సిరప్ బాటిల్‌ను మింగింది.
 
అది మరొక జీవి అని నమ్మి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నందా ఎక్స్‌లో షేర్ చేశారు. పాము నోటిలో బాటిల్ ఇరుక్కుపోయిందని చూపిస్తుంది. స్థానికులు స్నేక్ రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు. 
 
వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం పాము గొంతులోని బాటిల్‌ను జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేయబడినప్పటి నుండి, ఇది వైరల్‌గా మారింది. 84,000 వీక్షణలను సంపాదించింది.