శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 మే 2024 (20:57 IST)

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెమల్ అంటూ పేరు.. 102 కిలో మీటర్ల వేగంతో...

cyclone
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింతగా బలపడుతోంది. అల్పపీడనం తుపానుగా మారాక గంటకు 102 కిలో మీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 27వ తేదీ వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల వారు చేపల వేట, ఇతర ఏ పనులపైనా సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టం చేసింది. 
 
ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి శనివారం ఉదయానికల్లా తుపానుగా, ఆ తర్వాత తీవ్ర తుపానుగా మారుతుంది.
 
ఆదివారం సాయంత్రానికల్లా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, మిజోరం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
హిందూ మహా సముద్రంలో ఏర్పడే తుపానులకు పెట్టే పేర్ల క్రమంలో.. ప్రస్తుతం ఉన్న పేరు రెమల్. దీనిని ఈ తుపానుకు పెట్టనున్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.