సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 మే 2024 (19:04 IST)

ఒడిశాలో వడదెబ్బకు 14మంది మృతి

heat wave
ఒడిశాలో వడదెబ్బకు 14మంది ప్రాణాలు కోల్పోయారు. ఒడిశా సుందర్‌గఢ్ జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఈ సముద్రతీర రాష్ట్రంలో పరిస్థితులు దుర్భరంగా మారాయని అధికారులు తెలియజేశారు. రౌర్కెలాలో ఎండలు మరీ దుర్భరంగా ఉన్నాయి. 
 
పశ్చిమ ఒడిశాలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మండే ఎండల అస్వస్థతతో 44 మంది ఆసుపత్రిలో చేరారని ఆయన తెలియజేశారు. 
 
ఈ క్రమంలో వడదెబ్బతో రౌర్కెలా ప్రభుత్వ ఆసుపత్రిలో పది మరణాలు, సుందర్‌గఢ్ జిల్లా ఆసుపత్రిలో నాలుగు మరణాలు నమోదు అయ్యాయి. మరణాలకు మండే ఎండల సంబంధిత అస్వస్థతలు, వడదెబ్బలు కారణం కావచ్చునని ఆసుపత్రిలో వైద్యులు సూచించారు.