మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (08:42 IST)

నేడు సోనియా నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

sonia
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన మంగళవారం ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. ఉదయం 9.30 గంటలకు ఈ భేటీ జరుగుతుంది. ఇందులో ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించబోయే బిల్లులపై చర్చిస్తారు. 
 
అలాగే, దేశంలో విపరీతంగా పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రాన్ని నిలదీసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఈ నెల 8వ తేదీన ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అస్త్రాలను సిద్ధం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.