శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (22:27 IST)

బీజేపీ శ్రేణుల అరాచక దాడి... పోలీసును చితకబాదిన కార్యకర్తలు (Video)

bjp cadre attack
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు.. ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ శ్రేణులు అరాచక, ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను పట్టుకుని బీజేపీ కార్యర్తలు చితకబాదారు. ఆ కానిస్టేబుల్‌ను చివరకు ఓ బీజేపీ కార్యకర్తే రక్షించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. అయితే, ఈ దాడిలో ఎక్కడి జరిగిందన్న విషయాన్ని మాత్రం తెలియరాలేదు. బీజేపీ శ్రేణులు దాడి చేసిన కానిస్టేబుల్ మాత్రం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని వీడియో చూస్తే ఇట్టే గ్రహించవచ్చు. 
 
కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన ఈ వీడియోలో దాడి ఏ ప్రాంతంలో ఈ దాడి జ‌రిగింద‌న్న వివ‌రాలు తెలియ‌న‌ప్ప‌టికీ... ఖాకీ యూనీఫాంలో, త‌ల‌కు హెల్మెట్ పెట్టుకుని ఉన్న ఓ న‌డి వ‌య‌సు పోలీసును ప‌ట్టుకున్న బీజేపీ శ్రేణులు... ఆయ‌న‌పై త‌మ పార్టీ జెండాల‌కు వినియోగించే క‌ర్ర‌లు, రాడ్లు, రాళ్ల‌తో మూకుమ్మ‌డిగా దాడికి దిగాయి. 
 
ఈ దాడి నుంచి త‌ప్పించుకుని ప‌రుగులు తీసిన ఆ పోలీసును బీజేపీ శ్రేణులు వెంబ‌డించి మ‌రీ మ‌రోమారు దాడికి దిగాయి. ఈ సందర్భంగా ఆ పోలీసు కింద‌ప‌డిపోయినా బీజేపీ కార్య‌క‌ర్త‌లు దాడికి దిగారు. 
 
చివ‌ర‌కు బీజేపీ శ్రేణుల్లోని ఓ వ్య‌క్తి ఆయన‌ను ఓ భ‌వ‌న స‌ముదాయంలోకి తీసుకెళ్లారు. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ కూడా షేర్ చేసింది. వీడియోలో క‌నిపించే జెండాలే ఈ దాడికి సాక్ష్య‌మంటూ త‌న ట్వీట్‌కు కాంగ్రెస్ పార్టీ కామెంట్ జ‌త చేసింది.