శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 12 సెప్టెంబరు 2022 (20:41 IST)

తల్లి... తగ్గేదేలే...: యాంకర్ అనసూయ వీడియో షేర్

Anasuya's beauty
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్‌కు వన్యప్రాణులంటే మక్కువ ఎక్కువ. తనకు టైం దొరికితే చాలు వాటికి సంబంధించి కేర్ తీసుకుంటుంటారని ఆమె సన్నిహితులు చెపుతుంటారు. మూగప్రాణుల పట్ల దయ చూపాలని ఆమె చెపుతుంటారు. సెలబ్రిటీల్లో చాలామంది ఇలాగే మూగజీవాల పట్ల దయ చూపిస్తుంటారు.

 
ఇక అసలు విషయానికి వస్తే... తాజాగా అనసూయ ఓ వీడియోను పోస్ట్ చేసారు. అందులో పిల్లిపిల్లను ఓ పెద్ద కుక్క నోటితో పట్టుకుని విదిలిస్తోంది. అంతే.. తల్లిపిల్లి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక్క ఉదుటున కుక్కపై దాడి చేసింది. ఆ దెబ్బతో పిల్లిపిల్లను వదిలేసి కుక్క వెనక్కి తగ్గింది. దీనిపై అనసూయ కామెంట్ పోస్ట్ చేస్తూ... తల్లి.. తన పిల్లలను రక్షించుకునేందుకు ఎంతకైనా వెనకాడదు. అమ్మంటే అంతే అంటూ కామెంట్లు పెట్టింది. చూడండి ఈ వీడియో..