ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2024 (14:20 IST)

కేరళ హోటల్ బిర్యానీలో చచ్చిపోయిన జెర్రీ.. తినేసిన ఎస్సై.. చివరికి?

centipede in biryani
centipede in biryani
కేరళలోని ఓ రెస్టారెంట్‌లో పోలీస్ ఎసై తీసిన బిర్యానీలో జెర్రీ కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కేరళ తిరువల్వా జంక్షన్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో ఎస్సై అజిత్ కుమార్ బిర్యానీ తీసుకున్నారు. ఆ బిర్యానీని తింటుండగా అందులో చనిపోయిన జెర్రి వుండటం గమనించి షాకయ్యాడు. 
 
దీనిపై హోటల్ యజమాని దగ్గర అడిగినా అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు అజిత్ సమాచారం చేరవేశారు. ఈ ఫిర్యాదు మేరకు హోటల్‌కు వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ హోటల్‌ అపరిశుభ్రంగా వుండటం చూసి తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో ఆ హోటల్‌ను సీజ్ చేశారు. ఇక బిర్యానీలో జెర్రీ వుండటం బిర్యానీ ప్రియులకు షాక్ ఇచ్చింది.