టీకా వల్ల కాదు.. అనుమానాస్పద విషం వల్ల మృతి : భారత్ బయోటెక్ క్లారిటీ
కరోనా వైరస్ వ్యాప్తికి విరుగుడుగా ఫార్మా కంపెనీలు తయారుచేసిన టీకాల పంపిణీ ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. అయితే, భారత్ బయోటెక్ తయారు చేసిన టీకాను వేయించుకున్న వలంటీరు చనిపోయాడు. 9 రోజులకు ముందు డ్రై రన్‌లో ఈ టీకా వేయగా, వాలంటీర్ మృతి చెందాడు. దీంతో వ్యాక్సిన్ రీయాక్షన్ వల్లే వాలంటీర్ మృతి చెందినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దానిని సరిచేసేందుకు భారత్ బయోటిక్ సంస్థ వివరణ ఇచ్చింది.
భోపాల్‌లో ఫేజ్-3 ట్రయల్స్‌లో వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ కన్నుమూశాడు. గత నెలలో టీకాలు వేసిన తొమ్మిది రోజుల తర్వాత 'సైట్ యొక్క ప్రాథమిక సమీక్షలు మరణం అధ్యయన మోతాదుతో సంబంధం లేదని సూచిస్తున్నాయి'. 'పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం… అనుమానాస్పద విషం కారణంగా కార్డియోస్పిరేటరీ వైఫల్యమే వాలంటీర్ మరణానికి కారణం' అని సంస్థ ప్రకటించింది.