గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (19:54 IST)

నన్ను కూడా కరోనా కాటేసిందంటున్న పవన్ మాజీ భార్య (video)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఈమె ప్రస్తుతం దర్శకత్వం చేస్తూ బిజీగా ఉంటున్నారు. పైగా, ఇటీవలే తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, తన భర్త ముఖాన్ని మాత్రం ఇప్పటివరకు బాహ్య ప్రపంచానికి చూపించడం లేదు. ఇదిలావుంటే కరోనా లాక్డౌన్ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాను కూడా ఈ వైరస్ బాధితురాలినేనని చెప్పింది. 
 
ప్రస్తుతం వైద్య చికిత్స అనంతరం తాను కోలుకున్నట్టు చెప్పారు. ఇపుడు తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని అన్నారు. కరోనా సోకడంతో తాను కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యానని, షూటింగులకు బ్రేక్ ఇచ్చానని తెలిపారు. 
 
ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగులకు వెళ్తున్నానని చెప్పారు. కరోనా ప్రభావం ఇంకా ఏమాత్రం తగ్గలేదని, పరిస్థితులు అలాగే ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
 
కాగా, తాను ప్రధాన పాత్రను పోషించిన వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయిందని... త్వరలోనే దానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని రేణు దేశాయ్ చెప్పారు. ఒక క్రేజీ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలిపారు. 
 
వీటితో పాటు రైతు సమస్యలపై తీయబోతున్న సినిమా మార్చి నెలలో సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పారు. సోషల్ మీడియాలో లైవ్ ఛాటింగ్ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
 
ఇదిలావుంటే, మెగా ఫ్యామిలీకి చెందిన అనేక మంది హీరోలు కరోనా వైరస్ బారినపడ్డారు. వీరిలో నాగబాబు, చిరంజీవి, వరుణ్ తేజ్, రామ్ చరణ్ తేజ్‌తో పాటు.. చిరంజీవి ఇంట్లో పని చేసే పని మనుషులు కూడా ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు.