సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (15:47 IST)

బార్బర్ షాపునకు వెళ్తుతున్నారా? జర జాగ్రత్త...

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో కేవలం నిత్యావసర సేవలు మాత్రమే అందుబాటులోకి ఉన్నాయి. అయితే, లాక్‌డౌన్ కారణంగా బార్బర్ షాపులు కూడా మూసివేసున్నారు. దీంతో అనేకమంది షేషింగ్, జుత్తు పెరిగిపోయివుంది. ఎపుడెపుడు బార్బర్ షాపులు తెరుస్తారా షాపులకెళ్లి క్రాప్, షేవింగ్ చేసుకుందామా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారు జరజాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఎందుకంటే.. అమెరికాలో 50 శాతం కరోనా కేసులు ఈ బార్బర్ షాపుల ద్వారానే వచ్చినట్టు పలు ఉదాహరణలు చూపిస్తున్నారు. ఈ ఇబ్బంది ఏ దేశంలోనైనా ఉంటుందని, ఆయా షాపుల్లో వాడే రేజర్, బ్రష్, టవల్, కుర్చీ కూడా కరోనా వ్యాప్తికి కారణమవుతాయని చెబుతున్నారు. 
 
'షాపు తెరిస్తే ఎంతోమంది వస్తారు. కనీసం ఇంటి వద్దకు రప్పించుకుని చేయించుకున్నా అలా చాలామంది చేయించుకుని ఉంటారు. వీరిలో ఏ ఒక్కరు కరోనా బాధితులైనా అందరికీ రావడం ఖాయం' అని హెచ్చరిస్తున్నారు. 'లాక్‌డౌన్‌ ముగిసే వరకే కాదు, ఆ తర్వాత కొన్నాళ్ల వరకు ఇంట్లోనే పనిపూర్తి చేసుకోవడం బెటర్. లేదంటే బార్బర్‌ను ఇంటికి పిలిస్తే మీ వ్యక్తిగత సాధనాలు ఇచ్చి పనిపూర్తి చేయించుకోవాలి' అని కోరుతున్నారు. 
 
ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి బార్బర్ షాపులు తెరిపించాలంటూ విజ్ఞప్తులు వస్తున్నాయి. 'నా భార్య పెరిగిన నా జుత్తు చూడలేకపోతున్నానంటోంది. కటింగ్ చేయించుకోకుంటే తానే కటింగ్ చేస్తానంటోంది. అందువల్ల షాపులు తెరిచేలా చూడన్నా' అంటూ ఓ యువకుడు మంత్రి కేటీఅర్‌కు ట్వీట్ చేశాడు. దీనికి కేటీఆర్ 'క్రికెటర్ కొహ్లీ అంతటోడే భార్య అనుష్కతో కటింగ్ చేయించుకున్నాడు. నువ్వు కూడా అదే ఫాలో అయిపోతే పోలే' అంటూ సరదాగా సమాధానమిచ్చారు.