సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 మే 2017 (15:19 IST)

కేజ్రీవాల్ అవినీతిపరుడా.. రూ.2 కోట్లు లంచం తీసుకున్నాడా? ఆరోపణలు నిగ్గు తేల్చండి.. ఎల్.జి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ నేత కపిల్ మిశ్రా ఆరోపించారు. ఈయనను మంత్రివర్గం నుంచి తొలగించిన మరుక్షణమే ఆయన సీఎం కేజ్రీవాల్‌పై ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. మంచినీటి ట్యాంకర్ యజమ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ నేత కపిల్ మిశ్రా ఆరోపించారు. ఈయనను మంత్రివర్గం నుంచి తొలగించిన మరుక్షణమే ఆయన సీఎం కేజ్రీవాల్‌పై ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. మంచినీటి ట్యాంకర్ యజమానుల నుంచి రూ.2 కోట్ల లంచాలు పుచ్చుకున్నారన్నది కపిల్ శర్మ ప్రధాన ఆరోపణ. 
 
దీనిపై కపిల్ శర్మ స్పందిస్తూ ఈ స్కామ్‌కు ప్రత్యేక్ష సాక్షిని తానేని ప్రకటించారు. ఢిల్లీలో మంచినీటి సరఫరా నిమిత్తం ట్యాంకర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించిన వేళ, ట్యాంకర్ల యజమానుల నుంచి రూ.2 కోట్లను కేజ్రీవాల్ లంచంగా తీసుకున్నారని, అందుకు తానే ప్రత్యక్ష సాక్షినని ఆయన ప్రకటించారు. 
 
అనంతరం సోమవారం ఉదయం తన వద్ద ఉన్న ఆధారాలను ఏసీబీకి అందించారు. ఆతర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. వీటిని పరిశీలించిన ఎల్జీ.. ఆరోపణలను నిగ్గు తేల్చాల్సిందిగా ఏసీబీని ఆదేశించారు. దీనిపై విచారణ చేసి, కేవలం ఏడురోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీంతో అవినీతి నిరోధక శాఖాధికారులు పని ప్రారంభించారు.