గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (08:28 IST)

గుజరాత్ - హిమాచల్ : రెండు చోట్లా బీజేపీనే...

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రాంభమైంది. ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఇరు రాష్ట్రాల్లో బీజేపీనే ముందంజలో ఉంది.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రాంభమైంది. ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఇరు రాష్ట్రాల్లో బీజేపీనే ముందంజలో ఉంది. 
 
గుజరాత్‌లో 29 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ పూర్తి కాగా, బీజేపీ 19, కాంగ్రెస్ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక హిమాచల్ విషయానికి వస్తే 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో తొలి రౌండ్ పూర్తి కాగా, 8 చోట్ల బీజేపీ, 2 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. 
 
తొలి ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఓట్ల లెక్కింపునకు ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించగా, హిమాచల్‌లో కాంగ్రెస్‌కు, గుజరాత్‌లో బీజేపీకి ఆధిక్యం కనిపించింది.