సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2020 (17:28 IST)

కరోనా ప్రభావం తక్కువ ఉన్న ప్రాంతాల్లో సడలింపులు :: పనిచేసేవి.. అనుమతించనివి...

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా కేంద్రం లాక్‍‌డౌన్ అమలవుతోంది. అయితే, ఈ నెల 20వ తేదీ నుంచి కొన్ని సడలింపులు ఇచ్చారు. వలస కార్మికులకు ఉపాధిని కల్పించేందుకు ఈ చర్యలు ఉపయోగపడనున్నాయి. లాక్‌డౌన్ సడలిస్తున్న ప్రాంతాల్లో ఏవి పనిచేస్తాయి? ఏవి పనిచేయవు? అనే విషయాలను తెలుసుకుందాం. 
 
ఈ సడలింపుల తర్వాత.. ఆర్బీఐ, బ్యాంకులు, సెబీ, బీమా కంపెనీలు, సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి... జాతీయ గ్రామీణ ఉపాధి పనులు చేసుకోవచ్చు. అలాగే, నీరు, శానిటేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, పవర్ రంగాలు. సరుకుల లోడింగ్, అన్‌లోడింగ్ పనులు (రాష్ట్ర, అంతర్రాష్ట్ర). ఆన్‌లైన్ టీచింగ్, డిస్టెన్స్ లెర్నింగ్. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డీటీహెచ్, కేబుల్ సర్వీసులు చేసుకోవచ్చు. 
 
అలాగే, ప్రభుత్వ కార్యకలాపాల కోసం పని చేసే డేటా సెంటర్లు, కాల్ సెంటర్లు. మెడికల్, ఎమర్జెన్సీ స్టాఫ్ కోసం హోటల్స్, లాడ్జిలు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలు. ఫుడ్ ప్రాసెసింగ్, ఔషధాలు, మెడికల్ ఎక్విప్ మెంట్ కంపెనీలు. గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులు. 
 
కార్మికులు అదనంగా అవసరం లేని, గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణ పనులు (రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు). మెడికల్, వెటర్నరీ కేర్ సామగ్రిని తీసుకెళ్లే ప్రైవేట్ వాహనాలు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల కార్యాలయాలు. బాలురు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల వసతి గృహాలు.
 
అనుమతించనివి ఏమిటంటే... రైలు, రోడ్డు, విమాన ప్రయాణాలు, ఈ-కామర్స్ కంపెనీలు సరఫరా చేసే అత్యవసరంకాని వస్తువులు, విద్యాలయాలు, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్, పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు, ఆతిథ్య రంగం, సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్సులు, రాజకీయ, సామాజిక కార్యకలాపాలు, మతపరమైన కార్యక్రమాలు, ఒక్క రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లేందుకు వలస కార్మికులకు అనుమతి నిరాకరణ.