ఆ రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కరోనా టెస్టులు తప్పనిసరి : ఉత్తరాఖండ్
ఆ ఐదు రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. నిజానికి ఇటీవల తగ్గిన కేసులు కాస్త.. మళ్లీ పెరుగుతుండుంటంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి.
ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్‌ను అమలు చేస్తోంది. అలాగే, కఠినమైన ఆంక్షలను విధించింది. పెరుగుతున్న కేసుల మధ్య ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా పకడ్బందీగా చర్యలను అమల్లోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు, పర్యాటకులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఘఢ్ రాష్ట్రాల నుంచి ఉత్తరఖండ్‌కు వచ్చే ప్రయాణికులు, పర్యాటకులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర సరిహద్దులతో పాటు అన్ని రైల్వేస్టేషన్లు, డెహ్రాడూన్ ఎయిర్‌పోర్టులో కరోనా టెస్టు సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఈ కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.