నాగపూర్‌లో మార్చి 7వ తేదీ వరకు నో స్కూల్స్

corona virus
సెల్వి| Last Updated: మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (10:23 IST)
భారత దేశంలో కరోనా కేసులు మళ్ళీ భయపెడుతున్నాయి. తగ్గినట్టే తగ్గి మళ్ళీ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.

మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఆయా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్రలోని అమరావతి, యావత్మల్ జిల్లాల్లో లాక్ డౌన్ విధించగా, పూణేలో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.

ఇక ఇప్పుడు నాగపూర్ లో మార్చి 7 వ తేదీ వరకు స్కూళ్ళు, కాలేజీలను మూసేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. నాగపూర్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.దీనిపై మరింత చదవండి :