సీబీఎస్ఈ కీలక ప్రకటన.. ఏప్రిల్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం

Students
Students
సెల్వి| Last Updated: గురువారం, 11 ఫిబ్రవరి 2021 (23:32 IST)
కరోనా లాక్‌డౌన్‌కు అనంతరం పాఠశాలలన్నీ తెరుచుకుంటున్నాయి, విద్యార్థులను తరగతులకు స్వాగతం పలకాల్సిన సమయం వచ్చిందని తెలిపింది. ఇంకా తొమ్మిది, 11వ తరగతులకు సంబంధించి సీబీఎస్ఈ కీలక ప్రకటన చేసింది.

'2021-22 విద్యా సంవత్సరం 2021 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు లోబడి సాధ్యమయ్యేంతవరకు ప్రారంభించడం సముచితం" అని సీబీసీఎస్ఈ ఆ నోటీసులో పేర్కొంది. ఇంకా 9, 11వ తరగతులకు కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ పరీక్షలు విద్యార్థులు తదుపరి తరగతులకు ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నారనేది తెలుస్తుందని వెల్లడించింది.

అంతేగాక, వచ్చే ఏప్రిల్ 1 నుంచి కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులు కూడా ప్రారంభించాలని స్పష్టం చేసింది. పాఠశాలలు వ్యక్తిగతంగా విద్యార్థులపై దృష్టి పెట్టాలని, అభ్యాస అంతరాలను తగ్గించడానికి ప్రయత్నించాలని బోర్డు సూచించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలు దాదాపు ఏడాదిగా తెరుచుకోని విషయం తెలిసిందే.



దీనిపై మరింత చదవండి :