గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2016 (14:54 IST)

జయత్త చాలా స్ట్రిక్ట్-శశియత్త చాలా మంచివారు.. పోయెస్ గార్డెన్ వెళ్తే రోబోనే: జయ మేనల్లుడు

దివంగత సీఎం జయలలిత మరణంపై అనుమానాలున్నాయని.. ఆమె మరణానికి ఆమె నెచ్చెలి శశికళే కారణమని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ విమర్శిస్తున్న నేపథ్యంలో, జయ సోదరుని కుమారుడు, దీప సోదరుడు దీపక్ శశికళ వంతపాడారు. జయ

దివంగత సీఎం జయలలిత మరణంపై అనుమానాలున్నాయని.. ఆమె మరణానికి ఆమె నెచ్చెలి శశికళే కారణమని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ విమర్శిస్తున్న నేపథ్యంలో, జయ సోదరుని కుమారుడు, దీప సోదరుడు దీపక్ శశికళ వంతపాడారు. జయలలిత మరణం తర్వాత దీపక్ తెరపై వచ్చారు. జయకు శశికతో పాటు అంత్యక్రియలు నిర్వహించారు. దీపక్ జయ సోదరుడైన జయకుమార్ కుమారుడు. తాజాగా దీపక్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట చర్చనీయాంశమైనాయి. 
 
34 ఏళ్ల పాటు తన మేనత్త అయిన జయలలిత వెంటనే శశికళ మాత్రమే ఉన్నారు. ఆమె చివరి క్షణం వరకు ఆమెకు తోడుగా శశి అత్తే ఉన్నారు. శశి అత్తే జయలలితకు అత్యంత విశ్వాసపాత్రురాలు. విషప్రయోగంతో మా మేనత్తను చంపారన్న విషయం కేవలం కట్టు కథ మాత్రమేనని దీపక్ క్లారిటీ ఇచ్చారు. అపోలో ఆసుపత్రిలో అత్త చికిత్స పొందిన 75 రోజుల్లో 5 రోజులు మినహా మిగిలిన అన్ని రోజులు తాను ఆమెతోనే ఉన్నా. అపోలో ఆసుపత్రి చికిత్స అంటే కేవలం ఒక్క డాక్టర్ మాత్రమే చేసే చికిత్స కాదు. లండన్ డాక్టర్, ఎయిమ్స్ వైద్యుల బృందం అందరూ కలసి అత్తకు చికిత్స చేశారని దీపక్ చెప్పుకొచ్చాడు. 
 
అత్తతో తమ కుటుంబీకులకు ఎలాంటి గొడవల్లేవని, సోదరి అయిన దీప అత్తతో అగాధం పెంచుకుందని.. అత్తను వీలున్నప్పుడల్లా కలిసేవాడినని, దీప అలా చేసేదికాదని తెలిపాడు. నాలుగు నెలల క్రితం పోయెస్ గార్డెన్‌లో జరిగిన ఓ పూజకు కూడా అత్త నన్ను పిలిచారు. పూజలో సంకల్పాన్ని కూడా తన చేతే చేయించారు. మధ్యాహ్నం భోజనం అక్కడే చేసి, రాత్రి ఇంటికి వెళ్లి పోయాను.

అత్త చాలా స్ట్రిక్ట్. అనేక కట్టుబాట్ల మధ్య పోయెస్ గార్డెన్‌లో ఉండాలంటే రోబోలా ఉన్నట్టు అనిపించేది. అందుకే ఎప్పుడైనా అక్కడకు వెళితే, సాయంత్రం కాగానే అత్త కంటబడకుండా అక్కడ నుంచి వచ్చేసేవాడినని దీపక్ చెప్పారు. రాజకీయాల్లో చేరే ఆసక్తి లేదని, దీపకు కూడా అదే చెప్తానని.. అత్త ఆస్తులు చెడ్డవారి చేతుల్లోకి వెళ్ళకుండా తాను అడ్డుకుంటానని, జయత్త ఆస్తులు ఎవరికి చేరాలో వారికే చేరుతాయని దీపక్ వ్యాఖ్యానించాడు.