బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (18:22 IST)

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు - కుప్పకూలిన వంతెన - వీడియో వైరల్

ఉత్తరఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వర్షాల దెబ్బకు భారీ భవంతులు, వంతెనలు కుప్పకూలిపోతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో డెహ్రడూన్‌ సమీపంలోని జఖాన్ నది వద్ద ఉన్న డెహ్రాడూన్ - రిషికేష్ వంతెన నీటి ప్రవాహం ధాటికి ఒక్క సారిగా కుప్ప కూలింది. బ్రిడ్జి కూలిన సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న వాహనాలు నదిలో పడిపోయాయి. 
 
కొన్ని వాహనాలు ఆ నీటి ప్రవాహానికి కొట్టుకు పోయాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రస్తుతం బ్రిడ్జి కూలిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియా‌లో వైరల్‌ అవుతోంది.