అమ్మకు కాన్పు చేసిన పదేళ్ల కుమారుడు.... ఎక్కడ?
ఓ పదేళ్ళ బాలుడు కన్నతల్లికి సురక్షితంగా కాన్పు చేశాడు. అదీ కూడా ఏ ఒక్కరి సహాయం లేకుండా ప్రసవం చేసి తన తమ్ముడికి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా రక్షించుకున్నాడు. ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీల
ఓ పదేళ్ళ బాలుడు కన్నతల్లికి సురక్షితంగా కాన్పు చేశాడు. అదీ కూడా ఏ ఒక్కరి సహాయం లేకుండా ప్రసవం చేసి తన తమ్ముడికి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా రక్షించుకున్నాడు. ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఢిల్లీకి చెందిన అష్లే మోరీ (36), కెల్సీ రీచర్డ్ అనే దంపతులు ఉద్యోగస్తులు. కెల్లీ రీచర్డ్ ఆఫీసుకి వెళ్లగా, గర్భవతి అయిన అష్లే ఇంట్లోనే ఉండేది. ఈ క్రమంలో కడుపులో కొంచెం నొప్పి రావడంతో అష్లే బాత్‌రూంకు వెళ్లింది. అయితే, నొప్పులు తీవ్రం అయి బాత్రూంలోనే పడిపోయింది.
ఆసమయంలో ఇంట్లో తన పదేళ్ల కుమారుడు ఫాంటెనాట్ జేడెనే తప్ప ఎవ్వరూ లేరు. ఆ బాలుడు ఆసుపత్రికి ఫోన్ చేశాడు. అయితే, ఆసుపత్రి సిబ్బంది వచ్చేసరికి ఆలస్యం అవుతుందని భావించిన బుడతడు... ఇపుడు ఏం చేయాలో తనకు చెప్పాలని తల్లిని అడిగాడు. ఆమె వివరిస్తుంటే జేడెనే కాన్పు చేశాడు. ఆ బాలుడికి ఓ తమ్ముడు పుట్టాడు.
కానీ, ఆ శిశువు శ్వాస తీసుకోవడం లేదు. ఈ విషయాన్ని గ్రహించిన ఆ బాలుడు వంటగదిలోని నాజిల్ ద్వారా కృత్రిమ శ్వాసను అందించాడు. ఇంతలో ఆసుపత్రి నుంచి సిబ్బంది వచ్చి తల్లీ బిడ్డను ఆస్పత్రికి తరలించారు. నిజానికి పుట్టిన శిశువుకి కృత్రిమ శ్వాసను అందించకపోయి ఉంటే ఆ శిశువు మృతి చెందేవాడని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగానే ఉన్నట్టు వారు చెప్పారు.