సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (11:50 IST)

ఢిల్లీలో నిర్భయ లాంటి ఘటన... ముఖం, జననాంగాలను కాల్చివేశారు..

దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. రోజురోజుకూ ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. హత్యాచారాలు మితిమీరిపోతున్నాయి. నిర్భయ వంటి ఘటనలు పదేపదే చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యువతిని హత్య చేసిన దుర్మార్గులు ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖం, జననాంగాలను కాల్చివేశారు. 
 
న్యూఢిల్లీలో డాబ్డి పోలీస్‌ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తులు యువతిని దారుణంగా హత్య చేశారు. దుస్తులు లేకుండానే మృతదేహాన్ని నాలాలో పడేశారు. యువతి మృతదేహాన్ని సెక్టార్-2 ప్రాంతంలోని సీఎన్‌జీ పంప్ వద్ద పోలీసులు గుర్తించారు. 
 
అయితే, యువతిని ఎవరూ గుర్తించకుండా ఉండటం కోసం దుర్మార్గులు అమానీయంగా ప్రవర్తించారు. ముఖం, జననాంగాలను కాల్చివేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు ఇటీవల మిస్సింగ్ కేసుల ఆధారంగా యువతిని గుర్తు పట్టే ప్రయత్నం చేస్తున్నారు.