గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 29 మే 2017 (10:31 IST)

భోజనం కోసం కూర్చునే చోట.. మూత్రవిసర్జన వద్దన్న ఆటో డ్రైవర్.. చంపేసిన యువకులు.. ఎక్కడ?

దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. బహిరంగ ప్రదేశంలో మూత్రవిసర్జన చేస్తున్న యువకుల్ని అడ్డుకున్న వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ జీటీబీ నగర్‌కు చెందిన రవీందర్‌

దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. బహిరంగ ప్రదేశంలో మూత్రవిసర్జన చేస్తున్న యువకుల్ని అడ్డుకున్న వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ జీటీబీ నగర్‌కు చెందిన రవీందర్‌ కుమార్‌(33) రిక్షా డ్రైవర్‌. శనివారం మధ్యాహ్నం జీబీటీ నగర్‌ మెట్రో స్టేషన్‌ ముందున్న పార్కింగ్‌లో ఆటోను నిలిపి ప్రయాణికుల కోసం ఎదురుచూస్తుండగా.. పార్కింగ్‌ గోడ పక్కనే చేతిలో బీర్‌ క్యాన్లున్న ఇద్దరు యువకులు మూత్రవిసర్జన చేస్తుండటం కనిపించింది.
 
అది ఆటో డ్రైవర్లు భోజనానికి కూర్చునే చోటుకావడంతో వారినే అడ్డుకునేందుకు కుమార్ వెళ్లాడు. పబ్లిక్‌ టాయిలెట్‌లోకి వెళ్లాల్సిందిగా కుమార్ సూచించాడు. ఆహారం తీసుకోవడం కోసం కూర్చునే చోట ఇలాంటి పాడు పని చేయొద్దని సూచించాడు. చిల్లర కూడా ఇస్తాను. పబ్లిక్ టాయ్‌లెట్ ఉపయోగించండి అన్నాడు. రవీందర్‌ మాటలతో రెచ్చిపోయిన యువకులు అతనితో గొడవపెట్టుకుని, తీవ్రంగా హెచ్చరించి వెళ్లిపోయారు. తిరిగి సాయంత్రానికి ఆటోస్టాండ్‌కు గ్యాంగ్‌తో వచ్చారు. 
  
రవీందర్ కోసం ఎదురుచూస్తూ ఆటో స్టాండ్ వద్ద కూర్చున్న యువకులు శనివారం రాత్రి 8 గంటల సమయంలో రవీందర్ ఆటో స్టాండుకు రాగానే.. అతనిపై ఇనుపరాడ్లు, ఇటుకలు, రాళ్లతో దారుణంగా తీవ్రంగా దాడి చేశారు. చివరికి రవీందర్ కిందపడిపోవడంతో అక్కడి నుంచి పారిపోయారు. కానీ రవీందర్‌ను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. కానీ అప్పటికే రవీందర్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. రవీందర్‌‌పై దాడి చేసిన యువకులు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులేనని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.