గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 మే 2024 (15:32 IST)

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కవితకు బెయిల్ పొడిగింపు

Kavitha
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్‌ను రోస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు సోమవారం పొడిగించింది. కవితకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. 
 
లిక్కర్ పాలసీ కేసులో కవితను రెండు నెలల క్రితం ఈడీ అరెస్ట్ చేసింది. ఆమె రెండు నెలలుగా తీహార్  జైలులో ఉంటున్నారు.
 
ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను ప్రత్యేక సీబీఐ కోర్టు పలుమార్లు పొడిగించింది. కవిత రిమాండ్‌ను జూన్ 3 వరకు పొడిగించిన కోర్టు.. కవితను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు అధికారులు.