గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ప్రీతి
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (15:28 IST)

ప్రపంచ వింతలన్నీ ఒకేచోట...

ప్రపంచ వింతలు ఏడు, అవి గిజా పిరమిడ్ - లీనింగ్ టవర్ ఆఫ్ పీసా - ఐఫిల్ టవర్ - రోమన్ కలోసియమ్ - తాజ్ మహల్ - క్రైస్ట్ ది రిడీమర్ - స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అని అందరికీ తెలుసు. వీటిలో ఒక్కో వింత ప్రపంచంలోని ఒక్కో ప్రాంతంలో ఉంది. వీటన్నింటినీ చూడాలంటే ఎంతో సమయం మరియు డబ్బు కావాలి.
 
కానీ ఢిల్లీ నగరంలోని ఓ పార్కులో వీటన్నింటినీ ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ ఏడు వింతలను ఒకేసారి చూసే సౌలభ్యం కల్పిస్తున్నట్లు తెలియజేసారు. ఇందులో మరో విశేషమేమిటంటే ఈ నమూనాలను టన్నుల కొద్దీ వ్యర్థ పదార్థాలతో తయారు చేస్తున్నారు. 
 
ఒక నిర్మాణం నుండి మరొక నిర్మాణానికి మధ్యలో 200 మీటర్ల దూరం ఉంచారు. కాబట్టి కేవలం అరగంటలోపే ప్రపంచ వింతలన్నీ వీక్షించవచ్చన్నమాట. గుజరాత్‌కు చెందిన ఓ ఆర్కిటెక్ట్‌కు వచ్చిన ఈ సృజనాత్మక ఆలోచనను ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈయన ఆధ్వర్యంలోనే పార్కులో ఈ కట్టడాల నిర్మాణం జరుగుతోంది.