సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 మార్చి 2024 (07:15 IST)

ఢిల్లీలో కూలిన ఆంబియెన్స్ మాల్‌ పైకప్పు.. వీడియో వైరల్

Mall
Mall
ఢిల్లీలో ప్రమాదం జరిగింది. వసంత్‌ కుంజ్‌లోని ఆంబియెన్స్ మాల్‌లో పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఢిల్లీలోని ఆంబియెన్స్ మాల్‌లోని సెంట్రల్ హాల్‌లో సాధారణ నిర్వహణ పనుల సమయంలో పైకప్పులోన ఒక భాగం కూలిపోయింది. 
 
నైరుతి ఢిల్లీలోని ఆంబియెన్స్ మాల్‌లో కాంక్రీట్ పైకప్పు భారీ భాగం కూలిపోయింది. ఈ సంఘటన అర్ధరాత్రి దాటినందున ఎటువంటి గాయాలు సంభవించలేదు.
 
 అర్ధరాత్రి 12.45 గంటల ప్రాంతంలో మాల్ సెంట్రల్ హాల్‌లో పైకప్పు పాక్షికంగా కూలిపోయిందని, శిధిలాలు సెక్షన్ చుట్టూ చెల్లాచెదురుగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, విచారణ జరుపుతున్నామని వారు తెలిపారు.
 
 ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కూలిపోయిన పైకప్పు నుండి శిధిలాలు ఎస్కలేటర్లు, రెయిలింగ్‌లపై పడినట్లు కనిపిస్తుంది. ముందుజాగ్రత్త చర్యగా మాల్‌ను ఒకరోజు పాటు మూసివేశామని, నిర్వహణ పనులు పూర్తయిన తర్వాత తిరిగి తెరవనున్నట్లు అధికారులు తెలిపారు.