సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2016 (08:55 IST)

రూ.1000 నోటుకు చెల్లు... బ్యాంకుల్లో పెద్ద నోట్ల మార్పిడి బంద్...

దేశ కరెన్సీ చరిత్రలో రూ.వెయ్యి నోటు ఇక కనుమరుగు కానుంది. ఇకపై రూ.1000 నోటు కంటికి కనిపించదు. అదేసమయంలో రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి కూడా కేంద్రం బ్రేక్ వేసింది.

దేశ కరెన్సీ చరిత్రలో రూ.వెయ్యి నోటు ఇక కనుమరుగు కానుంది. ఇకపై రూ.1000 నోటు కంటికి కనిపించదు. అదేసమయంలో రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి కూడా కేంద్రం బ్రేక్ వేసింది. కేవలం బ్యాంకు ఖాతాల్లో మాత్రమే జమ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు కరెన్సీ నోట్ల రద్దు అంశంపై గురువారం రాత్రి భేటీ అయిన కేంద్రక్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 
 
ఇకపై బ్యాంకుల్లో కరెన్సీ నోట్ల మార్పిడి ఉండదని తేల్చి చెప్పింది. పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి గడువు ఈ అర్థరాత్రితో ముగియనుండటంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, పాత రూ.500 నోట్లతో బిల్లుల చెల్లింపులకు.. డిసెంబర్‌ 15 వరకు గడువు పొడిగించింది.
 
అయితే, ఇందులో పౌర సేవలు, అత్యవసర సేవలు.. ప్రభుత్వ బిల్లుల చెల్లింపులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో రూ.2 వేల వరకు పాతనోట్ల ద్వారా ఫీజులు చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు. రద్దైన రూ.500, రూ.1000 నోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్‌ చేసేందుకు డిసెంబర్‌ 30 వరకు అనుమతి ఇచ్చారు.